సానియాకు షాక్.. ఖేల్ రత్నపై స్టే

 

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాకు ఖేల్‌రత్న ప్రకటించింన సంగతి తెలిసిందే. అయితే సానియా మిర్జాకు ఖేల్‌రత్న ఇవ్వడంపై పారాలింపిక్ అథ్లెట్ హెచ్ ఎన్ గిరీశ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సానియా మిర్జాకు ఖేల్‌రత్న ఇవ్వడంపై స్టే విధించింది. తాము స్టే ఎత్తివేసేవరకూ ఆమెకు ఖేల్ రత్న ఇవ్వరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు సానియా మిర్జా పేరుని సెలక్షన్ ప్యానెల్ ప్రతిపాదించడం 'అన్యాయం' అని 2012 లండన్ పారాలింపిక్స్ పోటీల్లో రజత పతక విజేత గిరీశ హోసనగెరె నాగరాజె గౌడ కేంద్రం తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఖేల్ రత్న అవార్డు కోసం కేంద్రం అనుసరించే పాయింట్ల విధానం ప్రకారం తాను 90 పాయింట్లతో రేసులో ముందున్నానని, సానియా మిర్జా నా దరిదాపుల్లో కూడా లేదని తెలిపాడు.