టీటీడీకి ఎమ్మెల్యే రాజీనామా
posted on Nov 22, 2018 4:31PM

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను తిరస్కరించారు. ఇప్పటికే పలువు టీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేటెడ్ పోస్టులకు రాజీనామా చేశారు. టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య కూడా ముదు జాగ్రత్తో తన నామినేటెడ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి నుంచి తప్పుకున్నారు. ఇప్పుటివరకూ పాలకమండలి సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ తెలుగు దేశంలో కీలక నాయకుడైన సండ్ర వెంకట వీరయ్య ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఫోటీ చేస్తున్నారు. టీటీడీలో సభ్యుడిగా ఉంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా సండ్ర వెంకటవీరయ్య రాజీనామాను టీటీడీ బోర్డు, ఏపీ ప్రభుత్వం ఆమోదించాయి.