కేకే, బొత్స ఫోటోలు ఉండటానికి వీల్లేదు.. వీహెచ్
posted on Jul 4, 2015 4:54PM

ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి అంతగా లేకపోయేసరికి ఆపార్టీలో నేతలంతా వేరే పార్టీలోకి వలసలు కట్టారు. ఇప్పటికే చాలామంది వేరే పార్టీల తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడుతున్నారు. పార్టీ లో ఉన్నంతకాలం పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండకుండా వేరే పార్టీలోకి మారడం చాలా దుర్మార్గమని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన గాంధీభవన్‌లోని కేకే, బొత్స ఫోటోలను తొలగించారు. కష్టకాలంలో పార్టీని వీడిన నేతల ఫొటోలు గాంధీభవన్‌లో ఉండటానికి వీల్లేదని వీహెచ్ అన్నారు. మరో కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కూడా పార్టీ ఫిరాయించిన వాళ్లపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డిఎస్ కు చాలా చేసిందని.. అలాంటి డిఎస్ కాంగ్రెస్ పార్టీని వీడతారని అనుకోలేదని.. కానీ తాను కూడా పదవి మీద వ్యామోహంతో పార్టీ మారరని ఎద్దేవ చేశారు. అసలు తెలంగాణ ఉద్యమంలోనే పాల్గొనని ఆయన బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నానని అనడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని నేతలు వీడినా.. కార్యకర్తలు ఉన్నారని.. నేతలను చూసి కార్యకర్తలు ఛీ కొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.