ఆపని చేసింది నా పీఏనే.. సందీప్ కుమార్


ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఈకేసు విచారణలో భాగంగా ఇప్పటికే ఓ మహిళ సందీప్ కుమార్ పై ఫిర్యాదు చేసింది. తాను ఓ విషయంలో మంత్రిగారికి ఫిర్యాదు చేయడానికి వచ్చానని... అప్పుడు తను తాగే డ్రింక్ లో మంత్రిగారు మత్తు పదార్ధం కలిపారని.. ఆతరువాత ఏం జరిగిందో తెలియదని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయన్ను పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో మరో కొత్త అంశం చోటుచేసుకుంది. అదేంటంటే.. యువతులతో తాను అశ్లీల భంగిమల్లో ఉన్న సీడీలను తయారు చేసింది తన వ్యక్తిగత కార్యదర్శి ప్రవీణ్ కుమారే అని.. ప్రవీణ్ కుమార్ తనను కూడా  బ్లాక్ మెయిల్ చేశాడని విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సీడీలను ప్రవీణ్ పలువురికి పంచాడని తెలిపాడు. మరి ఈ కేసు ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu