ఏదేమైనా డబ్బులు కావాలంటున్న సమంత

 

"అత్తారింటికి దారేది" చిత్రంతో టాప్ హీరోయిన్ స్థానంలో ఉన్న సమంతకు డబ్బు ఖచ్చితంగా కావాలంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తే పదవీ విరమణ వరకు ఎలాంటి బెంగ ఉండదు. కానీ సినిమాలు అలా కాదు. రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతుంటాయి. ఏరోజు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు అని అంటుంది సమంత. చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ.. అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అందులో కావలసినంత స్వేచ్చ ఉంటుంది. మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాను. కానీ డబ్బులు తీసుకోకుండా మాత్రం కాదు. అంత పెద్ద మనసు నాకు లేదు. కాకపోతే సినిమాకు తగినట్టు నా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాను అని చెప్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu