బాలయ్య సింహం ఖరీదు కోటి రూపాయలు...!

 

బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "లెజెండ్". ఈ సినిమాలో దాదాపు అన్ని ప్రత్యేకతలే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే... బాలయ్య ఈ సినిమాలో కొత్తరకం గెటప్ లో కనిపించనున్నాడు. అదే విధంగా తన ఆయుధాలు, వస్త్రాలంకరణ, సంభాషణలు అంత బాలయ్య అభిమానులకు కొత్త పండగను తెచ్చే విధంగా ఉండబోతుందట.

 

బాలయ్య అంటేనే ఒక సింహం. అలాంటి సింహానికి వాహనం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాగే ఇందులో బాలయ్య వాడే బైక్ కు ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది. దేశ,విదేశాల నుంచి కూడా ఈ బైక్ ను తమ సొంతం చేసుకోడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బైక్ ధర ఇండియాలో సుమారు 8 లక్షల నుండి 40 లక్షల వరకు ఉందని తెలిసింది. కానీ ఈ బైక్ కు ఉన్న డిమాండ్ వల్ల, పైగా బాలయ్య సినిమాలో వాడడం వలన మరింత క్రేజ్ పెరిగి.. కోటి రూపాయలైన ఇచ్చి ఈ బైక్ ను కొందామని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అంటే ఈ బైక్ బాలయ్యకు సింహం లాంటి వాహనంల తయారయ్యింది.అదే విధంగా ఈ సినిమాలో బాలయ్య వాడిన మరో ఒక వాహనంకు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

 

మరి ఇపుడే ఇలా ఉంటె.. ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే మాత్రం.. బాలయ్య బాక్సాఫీస్ దగ్గర సింహ గర్జన మోగించడం ఖాయం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu