తీవ్రవాది సమంత కాల్చివేత

 

ప్రపంచ మోస్ట్ వాంటెడ్ మహిళా తీవ్రవాది సమంత లేత్వయిటేని ఉక్రెయిన్‌లో కాల్చి చంపారు. సమంత ‘వైట్ విడో’ పేరుతో సుప్రసిద్ధురాలు. ముస్లిం కాకపోయినప్పటికీ ముస్లిం మతంలోకి మారి ఆమె గత కొన్నేళ్ళుగా అనేక దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎంతో అందంగా,అమాయకత్వం నిండిన ముఖంతో కనిపించే ఆమెను చూస్తే ఎవరూ తీవ్రవాది అని పొరపాటుగా కూడా అనుకోరు. ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత అతనికి ఓ ప్రేమలేఖ రాసిన కరడుగట్టిన తీవ్రవాది ఆమె. ‘‘ఓ షేక్ ఒసామా నీవు నాకు ఓ తండ్రి.. ఓ అన్న లాంటి వాడివి.. నిన్ను ఎవరూ ప్రేమించనంతగా నేను ప్రేమించాను.. భౌతికంగా నీవు లేకపోయినా.. నీవు అందించిన స్పూర్తితో ముస్లింలందరూ ఏకం కావాలి’’ అని కవిత్వం రాసిందామె. 2013 సెప్టెంబర్లో నైరోబిలోని మాల్ పై జరిగిన ఉగ్రదాడి వెనుక సమంత లేత్వయిటే హస్తం వుంది. ఒసామా మరణంతో కుంగిపోయిన సమంత. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం కూడా చేసిందట. సమంత భర్త జర్మనీకి చెందిన లిందే ఒక మానవబాంబు. అతను ముస్లింగా మారి తీవ్రవాది అవతారం ఎత్తాడు. లండన్‌లో 2005లో మానవబాంబుగా విధ్వంసం సృష్టించాడు. అతని వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సమంత కూడా ఎన్నో తీవ్రవాద చర్యలకు పాల్పడింది. లండన్ పేలుళ్లతో లేత్వయిటేకు ఉగ్రవాదులతో సంబంధమున్నట్టు సాక్ష్యాలు లభించాయి. ఆ సంఘటన తర్వాత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా మారింది. సమంతాను పట్టుకోవడానికి ఇంటర్ పోల్ అన్వేషణ కొనసాగిస్తునే రెడ్ నోటిస్  జారీ చేసింది. ఎట్టకేలకు సమంత చరిత్ర ఉక్రెయిన్‌లో ముగిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu