మీరు చేయలేదు కాబట్టి మేమూ చేయం: సజ్జల 

కరోనావైరస్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, ఎన్టీఆర్ ఎందుకు పెట్టారో తెలియదు కాని నిజంగా చంద్రబాబు వెన్నుపోటు దారుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని,  తన ప్రచారం ద్వారా ప్రజలను చంద్రబాబు గందరగోళం పరుస్తున్నాడని, కరోనా కట్టడికి సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, వలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సర్వే చేయిస్తున్నారని, వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారని, చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చోని లేఖలు రాస్తున్నారని, కరోనా టెస్టులు చేయడంలో దేశం ప్రధమలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, ప్రభుత్వ కార్యక్రమాలపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డికి చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవడం తెలియదని ఆయన వివరించారు. 

పుష్కరాల సమయంలో చంద్రబాబు వందల కోట్లు కాజేశారని, కరోనా కట్టడిలో అధికారులకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, గుజరాత్ నుంచి మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని, చంద్రబాబు తానే ఇంకా ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని, చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని, చంద్రబాబు సలహాలు ప్రభుత్వంకు అవసరం లేదని సజ్జల అన్నారు. " అఖిలపక్షం సమావేశం అడిగే అర్హత చంద్రబాబు కు లేదు. కరోనా పది రాజకీయ పార్టీలు సమావేశం పెట్టి చర్చించే అంశం కాదు..చంద్రబాబు ఎప్పుడైనా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారా..ప్రత్యేక హోదా మీద  అఖిలపక్షం ఏర్పాటు చేయమంటే చంద్రబాబు చేశారా," అంటూ సజ్జల నిలదీశారు. " జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళలేదు  అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆగుతారా," అంటూ సజ్జల ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu