సుబ్రతారాయ్ కు కోర్టులో ఊరట.. పేరోల్ పొడిగింపు..
posted on Sep 28, 2016 5:16PM

సహారా ఇండియా అధినేత సుబ్రతోరాయ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుబ్రతారాయ్ పేరోల్ ను అక్టోబర్ 24 వరకూ పొడిగిస్తూ తీర్పు నిచ్చింది. ఇటీవల కోర్టు సుబ్రతోరాయ్ పెరోల్ రద్దు చేసి ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన తల్లి మరణించిన నేపథ్యంలో పెరోల్ మంజూరు చేయగా..పెరోల్ కింద బయటకు రావడానికి అనుమతినిచ్చింది. దానితో పాటు సుబ్రతోరాయ్ న్యాయస్థానం విధించిన గడువులోగా ష్యూరిటీ చెల్లించాలని సూచించింది. కానీ సుబ్రతారాయ్ ష్యూరిటీ చెల్లించని నేపథ్యంలో ఆయన పెరోల్ రద్దు చేసి.. అదుపులోకి తీసుకోమని చెప్పింది. దీనిపై మరోసారి సుప్రీంను ఆశ్రయించగా.. సుబ్రతారాయ్ కు పేరోల్ గడువు పొడిగిస్తూ తీర్పునిచ్చింది.