ముస్లింలపై సాధ్వీ మరోసారి విమర్శలు..
posted on Jun 8, 2016 6:49PM

తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో మతఘర్షణలు చెలరేగుతున్న ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సాధ్వీ మాట్లాడుతూ కాంగ్రెస్ ముక్త భారత్ మిషన్ పూర్తి కావచ్చిందని, ఇప్పుడు ముస్లిం ముక్త భారత్‌ను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లిం విముక్త భారత్‌కు ఇదే సరైన సమయమని ఆమె సూచించారు. షారూఖ్, అమీర్‌ఖాన్‌లు పాక్ అనుకూలురంటూ మండిపడ్డారు. అమీర్ దంగల్‌ను హిందువులు చూడవద్దని పిలుపునిచ్చారు. వచ్చే ఏడు జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆదిత్యనాథ్‌ను ప్రకటిస్తే విజయం కమలానిదేనని ఆమె పేర్కొన్నారు.