సచిన్ వ్యాఖ్యలపై చాపెల్ ఆగ్రహం

భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పై సచిన్ తన పుస్తకంలో చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. తన ఆత్మకథలో సచిన్ వెల్లడించిన అంశాలన్నీ అసత్యాలని, ద్రావిడ్ ను తప్పించాలని తానెప్పుడూ ప్రయత్నం చేయలేదని, అంతేకాకుండా, సచిన్ ను కెప్టెన్ గా ఉండాలని కూడా తానెప్పుడూ కోరలేదని అంటున్నాడు గ్రెగ్ చాపెల్. అయితే, చాపెల్ వాదనను నమ్మే పరిస్థితి లేదు. 2005 నుంచి 2007 వరకు భారత జట్టు కోచ్‌గా పని చేసిన చాపెల్ అనేక వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. ఆటగాళ్ళ మధ్య విభజన తీసుకొచ్చి, క్రికెట్ లో గ్రూప్ రాజకీయాలు చేసినట్లు చాపెల్ పై ఆరోపణలు వున్నాయి. 2007 వరల్డ్ కప్ లో ఘోర పరాజయం, ఆటగాళ్ళ మధ్య సమన్వయమ లోపించడానికి చాపెల్ ప్రధాన కారకుడని క్రికెట్ విశ్లేషకులు, మాజీలు అభిప్రాయపడుతుంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu