సచిన్ కృష్ణపట్నం వచ్చాడోచ్!
posted on Nov 15, 2014 4:21PM

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. మొదట సచిన్ టెండూల్కర్ ఈనెల 16న నెల్లూరు జిల్లాలోని పుట్టమరాజు కండ్రిగ గ్రామానికి వస్తారని ఆయన సహాయకులు చెప్పారు. అయితే సచిన్ టెండూల్కర్ ఒకరోజు ముందుగానే నెల్లూరు జిల్లాకు వచ్చారు. అయితే ఆయన శనివారం నాడు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవుకు వచ్చారు. అక్కడ ఆయన బోటు ఎక్కి సముద్రంలో షికారు చేశారు. ఆయన ఈరాత్రికి కృష్ణపట్నం పోర్టు అతిథి గృహంలో బస చేస్తారు. ఆదివారం ఉదయం ఆయన పుట్టమరాజు కండ్రిగ గ్రామానికి వెళ్తారు. రోజంతా అక్కడే గడుపుతారు. సచిన్ టెండూల్కర్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగాపుట్టమరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆ గ్రామాభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆ గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆదివారం ఆయన ఆ గ్రామస్థులతో భేటీ అవుతారు. గ్రామంలో చేపట్టే పలు కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు.