మా ఆవిడ పోలీసు అనే పదానికే మచ్చ: ఎస్.ఐ. భర్త
posted on Nov 15, 2014 4:51PM

హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఓ సీఐతో వివాహేతర సంబంధాన్ని నడుపుతూ వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎస్ఐ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఆ మహిళా ఎస్ఐ భర్త సునీల్ దగ్గరుండి పోలీసులను తీసుకొచ్చి వీళ్ళిద్దరూ దొరికిపోయేలా చేశారు. ఆయన మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా భార్య పోలీసు అనే పదానికే మచ్చ తెచ్చింది. గతంలో కూడా కొన్నిసార్లు ఇంటికి ఆలస్యంగా వచ్చింది. ఎందుకు ఆలస్యమైందని అడిగితే ఏవేవో సాకులు చెప్పేది. నా భార్యకు సీఐతో అక్రమ సంబంధం వుందని నాకు గతంలోనే అనుమానం వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. నేను హోటల్ గది తలుపు కొట్టినప్పుడు ఎవరు అని అడిగింది. నేను మాట్లాడకుండా మూడు సార్లు తలుపు కొట్టిన తర్వాత అప్పుడు నైటీ సర్దుకుంటూ వచ్చి తలుపు తీసింది. నన్ను లోపలకు రావద్దని కూడా అడ్డుకుంది. నేను లోపలకు వెళ్లేసరికి లోపలి నుంచి సీఐ పరుగున బయటకు వచ్చాడు’’ అని వివరించారు.