రష్యాలో భారీ భూకంపం.. బద్దలైన అగ్నిపర్వతం

 

రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత  7.0గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నాది. పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో తాజా ప్రకంపనలు చోటుచేసుకోవడం గమనార్హం. గత భూకంపం ప్రభావంతోనే తాజా ప్రకంపనలు సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.ఇదిలా ఉండగా, కమ్చట్కా ద్వీపకల్పంలో శనివారం అర్ధరాత్రి అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. దాదాపు 600 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనంతో సుమారు 6,000 మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగసిపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. దీనితో పాటు, అత్యంత చురుగ్గా ఉండే క్ల్యూచెస్కీ అగ్నిపర్వతం కూడా బద్దలైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu