పోక్సో కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్

 

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని కృష్ణ మాస్టర్‌పై ఆమె కుటుంబసభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కృష్ణ మాస్టర్ బెంగళూరులో తలదాచుకుంటున్నట్లు గుర్తించిన  పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. గతంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువతులను మోసం చేసినట్లు కృష్ణ మాస్టర్‌పై అభియోగాలున్నాయి.

అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న కృష్ణ.. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బెంగళూరిలోని తన అన్న నివాసంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడి వెళ్లి అరెస్ట్‌ చేసి  అనంతరం కంది జైలుకు తరలించారు.ఇటీవల కృష్ణకు పెళ్లి అయింది. దీంతో భార్యకు సంబంధించిన రూ. 9.50 లక్షల నగదు తీసుకొని కృష్ణ బెంగళూరికి వెళ్లినట్లు తెలుస్తంది. గతంలో కూడా కృష్ణపై పలు ఆరోపణలు ఉన్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu