తిరుమలలో కొనసాగుతున్న బక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ  కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.  ఆదివారం (ఏప్రిల్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు  నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు  పైగా  సమయం పడుతోంది. ఇక శనివారం (ఏప్రిల్ 26) శ్రీవారిని మొత్తం  82వేల 811 మంది దర్శించుకున్నారు. వారిలో 34వేల 913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం 3 కోట్ల 24 లక్షల రూపాయలు వచ్చింది.

అదలా ఉండగా ప్రముఖ నటుడు నాని ఆదివారం (ఏప్రిల్ 27) ఉదయం సుప్రభాత సేవలో స్వామి వారిని  దర్శించుకున్నారు.  తన తాజా సినీమా హిట్ 23 విజయం  సాధించాలని కోరుకుంటూ ఆయన శనివారం కలినడకన తిరుమల చేరుకున్నారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. నానితో పాటు హిట్ 3 హీరోయిన్, చిత్ర బందం కూడా ఉన్నారు. 

Related Segment News