ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించిన సీఎం చంద్రబాబు

 

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని హైదరాబాదులోని వారి నివాసానికి వెళ్లి సీఎం చంద్రబాబు   పరామర్శించారు. ఇటీవల సుజనా చౌదరి లండన్ లో ఓ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇంటికెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. బేగంపేట్‌లోని కిమ్స్-సన్‌షైన్  ఆసుపత్రిలో సుజనాకు చేసిన సర్జరీ విజయవంతమైంది. 

మరో రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఆయన ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం చంద్రబాబు పరామర్శించారు. వైద్యులు ఇచ్చిన మెడికేషన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతోన్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.