హీరోయిన్ క్లీన్ బౌల్డ్
posted on Mar 11, 2015 3:05PM

బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హోన్సేన్ బౌలింగ్ ధాటికి ప్రముఖ బంగ్లాదేశ్ హీరోయిన్ నజ్నిన్ అక్తర్ హ్యాపీ క్లీన్ బౌల్డ్ అయిపోయింది. అంటే వీళ్ళిద్దరూ ఏ మైదానంలోనో క్రికెట్ ఆడారని అనుకుంటున్నారా? కాదు.. లవ్ గేమ్ ఆడారు. అసలు విషయంలోకి వెళ్తే, బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ రూబెల్ హోన్సీనే, బంగ్లాదేశ్ స్టార్ హీరోయిన్ నజ్నిన్ అక్తర్ హ్యాపీ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. అయితే ఆ తర్వాత వారిద్దరికీ ఏ గొడవొచ్చిందో ఏమోగానీ, రూబెల్ రెండు మూడు రోజుల్లో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీకి వెళ్తాడనగా అక్తర్ హ్యాపీ రూబెల్ మీద మానభంగం ఆరోపణలు చేసింది. రూబెల్ తనను ప్రేమ పేరుతో వంచించి మానభంగం చేశాడని ఆమె ఆరోపించింది. దాంతో రూబెల్ క్రికెట్ కెరీర్ మటాష్ అయిపోయినట్టేనని అందరూ అనుకున్నారు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ కేసు విషయాన్ని రూబెల్ క్రికెట్ టూర్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఆలోచిద్దామని చెప్పింది. దాంతో రూబెల్ బతుకుజీవుడా అనుకుంటూ క్రికెట్ టూర్‌కి వెళ్ళిపోయాడు. అక్కడ రూబెల్ రెచ్చిపోయి ఆడాడు. బౌలర్‌గా తన ప్రతిభా పాటవాలను భారీ స్థాయిలో ప్రదర్శించాడు. అతని బౌలింగ్ ధాటికి ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ళ వికెట్లు ఎలా పడ్డాయో సేమ్ టు సేమ్ ఇక్కడ బంగ్లాదేశ్‌లో వున్న హీరోయిన్‌గారు కూడా పడిపోయారు. దాంతో ఆమె తాను పెట్టిన రేప్ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. బంగ్లాదేశ్ పేరు నిలిపిన రూబెన్‌ను తాను క్షమించేశానని, ఇక అతనిమీద ఎలాంటి కేసూ వుండదని చెప్పింది.