టీ టీడీపీ నాయకుల అరెస్ట్

 

తెలంగాణ శాసనసభలో జాతీయగీతాన్ని అవమానపరిచారన్న ఆరోపణలతో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, గాంధీ, గోపీనాథ్, వివేక్, ప్రకాశ్ గౌడ్ తదితరులు అసెంబ్లీ నుండి రాజ్ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా బయలుదేరిన వీరిని అసెంబ్లీ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ నుంచి తమను సస్పెండ్ చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడం దారుణమని, ప్రజా సమస్యలపై నిలదీస్తామనే అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. జాతీయగీత ఆరోపణలో క్షమాపణ చెప్పడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం ఏకపక్షపాతిగా వ్యవహరిస్తోందని, ఈ వైఖరిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu