ఇంటినుంచే ఆర్టీఏ సేవలు

కొత్త బండి రిజిస్ట్రేషన్ కావాలన్నా, పాత లైసెన్స్ రెన్యూవల్ చేయాలన్నా ఇకపై ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అంతేకాదు లెర్నర్ లైసెన్స్ కోసం కూడా ఇంటినుంచే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే 59 సేవలను ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా వరకు ఆన్ లైన్ లోనే సేవలు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంట్లో నుంచే కంప్యూటర్‌‌, ఫోన్‌ ‌ద్వారా వాహన్‌‌ వెబ్‌సైట్‌‌లో కావలసిన సేవల కోసం అప్లై చేసుకోవచ్చు. డూప్లికేట్ ఎల్‌‌ఎల్‌‌ఆర్‌‌ (లెర్నర్‌‌ లైసెన్స్‌‌), డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జి , స్మార్ట్ కార్డ్(పాత లైసెన్స్ఇచ్చి కొత్తది తీసుకోవడం), లైసెన్స్ హిస్టరీ షీట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఆర్టీఏలో 59 సేవలను ఆన్‌‌లైన్‌‌ ద్వారా పొందే వీలుంది. ఇందులో 31 అంశాల్లో దరఖాస్తు దారులు నేరుగా ఆఫీస్ కు వెళ్ళాల్సి ఉంటుంది. వీటిలో ప్రస్తుతం 5 సేవలను పూర్తిగా ఆన్ లైన్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఆన్ లైన్ లో పంపించాలి. మరో 6 సర్వీసులను అతి త్వరలోనే ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి  తీసుకొచ్చే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu