హాలీవుడ్‌లో ఆర్‌పి సినిమా
posted on Sep 21, 2013 8:47PM

శ్రీను వాసంతి లక్ష్మీ, బ్రోకర్ సినిమాలతో నటునిగా దర్శకునిగా కూడా మంచి పేరుతెచ్చుకున్న సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్. తెలుగుతో సంగీత దర్శకత్వంతో పాటు నటునిగా, దర్శకునిగా కూడా ఘన విజయాలు సాదించిన ఆర్‌పి ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ఆర్ పి హాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సినిమా ఎమీ షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
టిపి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం పై ప్రసాద్ కూనిశెట్టి, రమేష్ నూతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ సినిమాలలా థియేటర్లలో రిలీజ్ చేయకుండా విఓడి ద్వారా విడుదల చేయనున్నారు. అక్టోబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను వీడియో ఆన్ డిమాండ్ ద్వారా ఇంటర్‌నెట్‌లొ రిలీజ్ చేస్తున్నారు.
దర్శక నిర్మాతలు తప్ప మిగతా అంతా హాలీవుడ్ వారే పని చేసిన ఈ సినిమా అమీష్ తెగకు సంభందించిన కథ. మానవ సమాజానికి దూరంగా బతికే ఈ తెగకు సంబందించిన ఎమి అనే అమ్మాయి జీవితంలోని ముఖ్య ఘట్టాలను సినిమాగా తెరకెక్కించారు ఆర్ పి పట్నాయక్. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉన్న ఆర్‌పి హాలీవుడ్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.