సమంతతో రొమాన్స్ కి నితిన్ రెడీ

 

ప్రస్తుతం "కొరియర్ బాయ్‌ కల్యాణ్", "హార్ట్‌ఎటాక్" చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్న నితిన్ మరో రెండు ప్రాజెక్టులకు సిద్ధం చేసుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో నటించనున్నాడు. అదే విధంగా తాజాగా ఏ.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.