పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు ప్రశ్నించడంలేదు.. రోజా
posted on Oct 11, 2015 5:32PM

వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. వైకాపా అధినేత జగన్ ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఏపీలో ప్రతి గుండె తపిస్తోందని, ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడంలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ గత ఎన్నికల్లో చంద్రబాబు, మోడీ అన్నారని.. దానికి పవన్ కళ్యాణే సాక్ష్యమని.. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను ఎందుకు ప్రశ్నించడంలేదని వైసిపి ఎమ్మెల్యే రోజా ఆదివారం ప్రశ్నించారు. జగన్ దీక్షకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికి, హోదా కోసం పోరాడాలని సూచించారు.