పోలీసుల అదుపులో జగన్ కారు డ్రైవర్‌

 

వైసీపీ అధినేత జగన్ కారు డ్రైవర్‌ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నల్లపాడు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కారు కింద పడిన వ్యక్తిని గుర్తించారా? ఆ సమాచారాన్ని జగన్‌కు తెలియజేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై జగన్‌ కారు డ్రైవర్‌ నుంచి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. మరోవైపు జగన్‌ పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు. 

వారి నుంచి ఫుటేజీని సేకరిస్తున్నారు. కాగా జగన్ పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు టైరు కింద పడి మృతి  చెందిన వీడియో వైరల్ అవుతుంది. ఈ కేసులో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డిని, A2గా వైఎస్ జగన్‌ను, A3గా కారు యజమానిని చేర్చాలని పోలీసులు నిర్ణయించారు.ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్‌లో అదనంగా 304 పార్ట్ 2 సెక్షన్ వర్తించే అవకాశం ఉంది. బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఎఫ్ఐఆర్‌లో సెక్షన్స్ మార్చి కోర్ట్ మెమో పంపాలని అధికారులు నిర్ణయించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu