ఘోర రోడ్డు ప్రమాదం: 25మందికి తీవ్ర గాయాలు

 road accident, srikakulam road accident, Major road accident Srikakulam, Srikakulam Major road accident

 

శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రణస్థలం వద్ద లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu