కిషోర్ చంద్రదేవ్ లేఖ వెనుక కుట్ర: బొత్స
posted on Nov 19, 2012 4:55PM

తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. తనపై కథనం వచ్చిన ఆంగ్ల దినపత్రికపై తాను పరువు నష్టం దావా వేస్తానని బొత్స చెప్పారు. తాను నామినేటెడ్ అభ్యర్థినని, తనను మార్చినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తనకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా లేఖ రాసినట్లు తనకు తెలియదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాగా పని చేస్తోందన్నారు. జాతీయ సమైక్యతను కాపాడగలిగేది కేవలం కాంగ్రెసు పార్టీ మాత్రమే అన్నారు.
కిషోర్ చంద్రదేవ్ లేఖ వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తనను మాఫియా డాన్‌తో పోల్చిన పత్రికపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన కూతురు వివాహాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.