కేసీఆర్ అంటే కచరా అంటా.. రేవంత్ కొత్త భాష


తెలంగాణ టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం కొత్తేమి కాదు.. అయితే ఓటుకు నోటు కేసులో తనను ఇరికించినందుకు కాను ఇప్పుడు మరింత ఎక్కువగా కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. అంతేకాదు కేసీఆర్ తిట్టడంలో కొత్త కొత్త పదాలు కూడా కనిపెట్టి మరీ విమర్శిస్తున్నారు. అదేంటనుకుంటున్నారా.. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించేప్పుడు కచరా అనే పదం ఉపయోగించారు. కచరా అంటే ఈ జగతిలో తానోక్కడే అని అర్ధమని.. అది క అంటే కల్వకుంట్ల.. చ అంటే చంద్రశేఖర్ అని.. రా అంటే రావు అని వివరించి మరి విమర్శించారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ లో ఉన్నరోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని మండిపడ్డారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు టీడీపీదే అని అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu