శాశ్వతంగా రాజకీయాలనుండి తప్పుకుంటా.. ప్రత్తిపాటి
posted on Oct 13, 2015 12:26PM
.jpg)
ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్ట్ ఆస్తులను విక్రయించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఇవన్నీ తప్పుడు ఆరోపణలని మండిపడుతున్నారు. అగ్రిగోల్డ్ కు సంబంధించి తన పేరు మీద కాని.. తన కుటుంబసభ్యుల పేరుమీద కాని ఒక్క సెంటు భూమికూడా రిజిస్టర్ చేయించుకోలేదని అన్నారు. కావాలనే వైసీపీ నేతలు తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. వాళ్లకి దమ్ము, ధైర్యం ఉంటే తాను అగ్రిగోల్డ్ ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్టు రుజువు చేయాలని.. వాళ్లు కనుకు రుజువు చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని.. శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ విసిరారు. ఒకవేళ అలా చేయకపోతే వైసీపీ నేతలు రాజీనామాకి సిద్దంగా ఉండాలి అని అన్నారు. అగ్రిగోల్డ్ సంస్ధ ద్వారా చాలా మంది నష్టపోయారు.. ఆ బాధితులకు న్యాయం జరగడానికి చంద్రబాబు చాలా ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు.