జైల్లో రేవంత్ ను ప్రలోభపెట్టే ప్రయత్నం జరిగిందా?
posted on Jul 4, 2015 3:38PM

ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించిన నేపథ్యంలో ఆయన అక్కడ ఏంచేశారు.. ఆయన ఆ సమయంలో కనీసం తెదేపా నేతలను కూడా కలవడానికి నిరాకరించారు.. కానీ జైల్లో ఉన్న రేవంత్ రెడ్డిని ప్రలోభ పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి అన్న వార్తలు ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని తీవ్ర ఒత్తిడికి గురైనట్టు.. ఆయనను తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్టు భావిస్తున్నారు. తెదేపాను ఎలాగైనా దెబ్బతీయాలనే.. తెలంగాణలో తెదేపా లేకుండా చేయాలనే కుట్రతో ఒక పథకం ప్రకారం రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించిన టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనే బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించి పార్టీ అధినేతను ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నించింది. దీనిలో భాగంగానే జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని ఈ కేసు వ్యవహారంలో తెదేపా పార్టీ అధినేత పేరు చెప్పాలని.. అప్రూవర్ గా మారాలని.. అలా మారిన నేపథ్యంలో 300 కోట్ల తో పాటు ఒక మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేశారని తెలుగు వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇదిగో చంద్రబాబు అరెస్ట్.. అదిగో చంద్రబాబు అరెస్ట్ అంటూ.. నోటీసులు జారీ చేస్తామంటూ తెగ సంబరిపడిపోతూ స్టేట్ మెంట్ లు ఇచ్చింది. కానీ వారిపప్పులేమి రేవంత్ రెడ్డి దగ్గర ఉడకలేదని.. తెదేపా పార్టీకి నమ్మినబంటు కాబట్టి.. అలాంటి తప్పుడు పనులు చేయనని ఖండిస్తూ గట్టిగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో టీ ప్రభుత్వం ఏం చేయాలో తెలీక వెనక్కి తగ్గిందని ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసి వాళ్లకి గట్టిగా బుద్ధి చెప్పింది.