జియో మరో బంపరాఫర్....

 

‘ధన్‌ ధనా ధన్‌’ ఆఫర్ తో ఇప్పటికే టెలికాం సంస్థలకు చెమటలు పట్టిస్తున్న రిలయన్స్ జియో ఇప్పుడు మరో ఆఫర్ తో ముందుకొస్తుంది. అదే ''వివో జియో క్రికెట్ మానియా''. ఈ ఆఫర్ ద్వారా.. వివో స్మార్ట్ ఫోన్ యూజర్లకు 168జీబీ వరకు జియో 4జీ డేటా ఇవ్వనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ కు వివో స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో జియో ఆ ముబైల్స్ తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో  ఈ ఆపర్ ను తీసుకొచ్చింది. అయితే దీనికోసం యూజర్లు చేయవలసింది ఏంటంటే... తొలుత వివో స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎంపికచేసుకున్న ఐపీఎల్ టీమ్ పేరును జియో కంపెనీకి ఎస్ఎంఎస్ చేయాలి.. యూజర్ల ఫేవరెట్ టీమ్ గెలిచినా,  ఓడినా లేదా మ్యాచ్ డ్రా అయిన జియో వారికి 4జీ డేటాను అందిస్తుంది. ఈ డేటా పొందడానికి చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే..
 
* ఫస్ట్ వివో స్మార్ట్ ఫోన్ యూజర్లకు జియో కనెక్షన్ ఉండాలి. ఆతరువాత ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ పేరును 59009 నెంబరుకు జియో వెబ్ సైట్ లో ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఎస్ఎంఎస్ చేయాలి. టీమ్ పేర్లను, వాటి కోడ్స్ ను జియో తన వెబ్ సైట్లో పొందుపరిచింది.
* తర్వాత యూజర్ల ఫేవరెట్ టీమ్ గెలిచినా, ఓడినా, మ్యాచ్ డ్రా అయినా 3జీబీ, 2జీబీ, 1జీబీ 4జీ డేటాను జియో అందిస్తోంది.
* ఒకవేళ యూజర్ల ఫేవరెట్ టీమ్ క్వాలిఫైర్స్ గా వెళ్తే, వారి కంప్లిమెంటరీ డేటా డబుల్ అవుతుంది. ఫైనల్స్ కు రీచ్ అయితే ఆ డేటా ట్రిపుల్ అవుతుంది.
* సిరిస్ ముగిసే సమయానికి మీ టీమ్ అన్ని మ్యాచ్ లు గెలిస్తే 168జీబీ వరకు 4జీ డేటాను విన్ అయ్యే అవకాశముంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu