భీమ్-ఆధార్ యాప్ ను ప్రారంభించిన మోడీ...
posted on Apr 14, 2017 3:02PM
.jpg)
ప్రధాని నరేంద్ర మోడీ భీమ్-ఆధార్ యాప్‌ను ఈరోజు నాగ్‌పూర్‌లో ప్రారంభించారు. ఈరోజు అంబేడ్కర్ 126వ జయంతి సందర్భంగా మోడీ ఈ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. దళిత, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తి అంబేడ్కర్ అని మోదీ కొనియాడారు. అవమానాలు ఎదుర్కొన్నా.. ఆయనలో ప్రతీకార ధోరణి ఎక్కడా కనిపించలేదన్నారు. జీవితంలో చేదు అనుభవాలున్నా.. మనకు మాత్రం అమృతాన్నే పంచారని పేర్కొన్నారు. భీమ్-ఆధార్ యాప్‌ను ఆయనకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు.
కాగా భీమ్‌యాప్‌లో భాగంగా పనిచేసే భీమ్-ఆధార్ ప్లాట్‌ఫాం వ్యాపారుల కోసం ఉద్దేశించింది. భీమ్ యాప్ ప్రారంభించిన నాలుగు నెలల్లో 1.9 కోట్ల డౌన్‌లోడ్లతో ఇప్పటికే కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆధార్‌ను ఉపయోగించడం ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయడానికి భీమ్-ఆధార్ ఉపయుక్తంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది.