తమిళరైతుల నిరసన...ఈసారి చీరల్లో
posted on Apr 14, 2017 3:59PM

రైతులకు సాయం అందించాలని.. రైతుల రణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు గత కొద్ది కాలంగా వినూత్నంగా తమ నిరసలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. మొన్న నగ్నంగా తమ నిరసన తెలిపిన రైతులు.. ఈరోజు చీరలు కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ రోజు తామంతా కావేరి నది బిడ్డలమంటూ చీరలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడులో కరవు రాజ్యమేలుతోందని, కేంద్రం తక్షణ సాయం ప్రకటించాలని కోరుతూ నిరసనలు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాదు రైతుల దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని... మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. తమిళనాడులో రైతుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించింది.