కరెంటు కష్టాలకు రిలయన్సే కారణం?

ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన విద్యుత్తు కోతలకు కారణం రిలయన్సే అని తెలిసింది. రిలయన్స్‌ సంస్థ మన రాష్ట్రంలోని గ్యాస్‌ అథారిత విద్యుత్తు కేంద్రాలకు ఒప్పందాల మేరకు చేయాల్సిన గ్యాస్‌ను సరఫరా చేయలేకపోవటంతో మనకు ఈ దుస్థితి ఏర్పడిరది. రిలయన్స్‌ సంస్థ కృష్ణా`గోదావరి బేసిన్‌ నుంచి పెద్ద ఎత్తున సహజవాయువును పైపు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతోంది. కేజీ బేసిన్‌ ద్వారా ధీరూభాయిఅంబానీ (డి`6) బావుల నుంచి రోజుకు 13.65 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎన్‌ఎంఎస్‌సిఎండి) గ్యాస్‌ను సరఫరా చేయాల్సి ఉండగా, రిలయన్స్‌ మాత్రం రోజుకు 6 ఎన్‌ఎంఎస్‌సిఎండి గ్యాస్‌ మాత్రమే సరఫరా చేస్తోంది. డి`6 గ్యాస్‌ ఉత్పత్తి తగ్గిపోవటం వల్లే తాము రాష్ట్రంలోని విద్యుత్తు కేంద్రాలకు తగినంత గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతున్నామని రిలయన్స్‌ బుకాయిస్తోంది.

 

 

 

అయితే ఈ సహజవాయువు క్షేత్రాలు ఆంథ్రా తీరప్రాంతంలో ఉన్నందున మిగిలిన బావుల నుంచి ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను కూడా మన విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేయవచ్చు. కానీ, రిలయన్స్‌ అలా చేయకుండా డి`6బావుల నుంచి వచ్చే గ్యాస్‌ను మాత్రమే ఇస్తామంటోంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాష్ట్రప్రభుత్వానికి రిలయన్స్‌కు మధ్యన ఉన్న అవగాహన ప్రకారం కేజీ బేసిన్‌ నుంచి సరఫరా అయ్యే గ్యాస్‌లో 13.65 ఎన్‌ఎంఎస్‌సిఎండి గ్యాస్‌ను మన విద్యుత్తు కేంద్రాలకు అందజేయాలి. అంతేకానీ, కేవలం డి`6 బావుల నుంచి వచ్చే గ్యాస్‌ను మాత్రమే సరఫరా చేయాలన్న నిబంధనలేవీ లేవు. కానీ, ఈ బావిలో ఉత్పత్తి తగ్గిపోయినందున ఆంధ్రాకు సహజవాయువు సరఫరాను తగ్గించాల్సి వచ్చిందని రిలయన్స్‌ అంటోంది. ఇక్కడ మరోవాదన కూడా వినిపిస్తోంది. రిలయన్స్‌ సంస్థ కావాలనే గ్యాస్‌ ఉత్పత్తిని తగ్గించిందని, గ్యాస్‌రేట్లను పెంచేందుకే ఆ సంస్థ ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా రిలయన్స్‌ చర్యల వల్ల రోజుకు సుమారు 1500 మెగావాట్ల విద్యుత్తుఉత్పత్తి లోటు ఏర్పడిరది. సహజవాయువు సరఫరాను పెంచాలని స్వయాన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu