మ‌ద్యం ధ‌ర‌ల‌పై మాట త‌ప్పి, మడ‌మ తిప్పింది అందుకేనా?

పీకే టీమ్ వ‌చ్చింది. స‌ర్వేల‌తో రంగంలోకి దిగింది. అందుకే, జ‌గ‌న్‌రెడ్డి నిర్ణ‌యాల్లో మార్పు క‌నిపిస్తోంది. మోనార్క్‌లా, దూకుడుగా, దోచుకోవ‌డ‌మే పాల‌న‌లా.. రెండున్న‌రేళ్లు ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపించిన ముఖ్య‌మంత్రి.. తాజాగా, త‌న‌కు అనుకూలంగా మాట త‌ప్పుతున్నారు.. త‌న‌కు లాభం జ‌రిగేలా మ‌డ‌మ తిప్పుతున్నారు.. అని అంటున్నారు. జ‌గ‌న్‌లో ఈ మార్పుకు కార‌ణం ప్ర‌శాంత్ కిశోరే అని టాక్‌. 

మూడు రాజ‌ధానుల బిల్లును జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డం వ్యూహాత్మ‌కం. కోర్టుల్లో టెక్నిక‌ల్‌గా నిల‌బ‌డే ఛాన్స్ లేక‌పోవ‌డంతో.. వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. అంత‌లోనే మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గిస్తూ.. మందు బాబుల మ‌త్తంతా దిగిపోయేలా వారికి గుడ్ న్యూస్ చెప్పారు. మ‌హిళ‌ల‌కు మాత్రం ఇది షాకింగ్ న్యూస్. ధ‌ర‌ల త‌గ్గింపుతో.. ఇక మ‌ద్యపాన నిషేధం హామీ అట‌కెక్కించిన‌ట్టేన‌ని అధికారికంగా చెప్పిన‌ట్టే. లిక్క‌ర్ విష‌యంలో జ‌గ‌న్‌లో ఇంత‌టి మార్పు ఎవ‌రూ ఊహించ‌లేదు. పీకే టీమ్ ఫీడ్ బ్యాక్ వ‌ల్లే.. జ‌గ‌న్ ఇలా మాట త‌ప్పి.. మ‌డ‌మ తిప్పి.. మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించార‌ని అంటున్నారు. 

పెంచ‌డమే కానీ త‌గ్గించ‌డం త‌న డిక్ష‌న‌రీలోనే లేని జ‌గ‌న్‌.. అందులోనూ భారీగా ఆదాయం వ‌స్తున్న‌.. అప్పుల‌కు ఊతం ఇస్తున్న‌ మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించ‌డం మామూలు విష‌యం కానే కాదు. మ‌రీ అంత‌లా పీకే టీమ్ జ‌గ‌న్‌ను ఎలా ఒప్పించిగ‌లిగింది? స‌డెన్‌గా ధ‌ర‌లు త‌గ్గించడానికి కార‌ణ‌మేంటి? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌.

ఏపీలో జ‌గ‌న్‌ను విమ‌ర్శించే గొంతుక‌లు కోట్ల‌ల్లోనే ఉంటాయి. వారందరిలోకెల్లా మందుబాబులు తిట్టిపోసేంత‌గా మ‌రెవ‌రూ తిట్టుండ‌రు. పెగ్గు పెగ్గుకీ జ‌గ‌న్‌కు శాప‌నార్థాలు పెడుతున్నారు. ఊరూపేరూలేని బ్రాండ్ల మ‌ద్యం తాగ‌లేక‌.. జేబులు లూటీ చేసే ధ‌ర‌లు చెల్లించ‌లేక‌.. మద్యం ప్రియులంతా.. బొట్టు బొట్టుకీ.. తిట్ల దండ‌కం అందుకుంటున్నారు. మద్యం తాగే వారిలో రోజుకూలీలే అత్యధిక మంది ఉంటారు. వారంతా సీఎం జగన్ ను మద్యం దుకాణాల ద‌గ్గ‌ర‌ బండబూతులు తిడుతుంటారు. ఏపీలో ఏ చోటికి వెళ్లినా ఈ సీన్ కామ‌న్‌. 

జేబుల‌కు చిల్లు పెట్టే.. ఆరోగ్యం గుల్ల చేసే.. మ‌ద్యం పాల‌సీపై ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉందో ఐ-ప్యాక్‌ టీమ్ స‌ర్వేలో తేలిందని తెలుస్తోంది. ఆ దారుణ‌మైన‌ ఫీడ్ బ్యాక్ జ‌గ‌న్ ముందు ఉంచి.. అత్య‌వ‌స‌రంగా మ‌ద్యం ధ‌ర‌ల‌ను స‌వ‌రించాల్సిందేన‌ని తేల్చి చెప్పార‌ని అంటున్నారు. పీకే బృందంపై ఎంతో న‌మ్మ‌కం ఉంచే జ‌గ‌న్‌.. వారు చెప్పిన‌ట్టు చేయ‌క త‌ప్ప‌లేద‌ని చెబుతున్నారు. అందుకే, ఇన్నాళ్లూ దోచుకున్నాక‌.. తాజాగా ప్ర‌భుత్వానికి బంగారు బాతులాంటి మ‌ద్యం ధ‌ర‌ల్లో కాస్త వెసులుబాటు క‌ల్పించార‌ని టాక్‌. పీకే టీమ్ సూచ‌న‌ల‌తో.. త్వ‌ర‌లో మ‌రిన్ని నిర్ణ‌యాల్లోనూ జ‌గ‌న‌న్న‌ మ‌డ‌మ తిప్ప‌డం ఖాయ‌మంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu