రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇంకా తిరిగి రాని రూ.6181 కోట్ల

 

రూ.2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లు పూర్తిస్థాయిలో తమకు చేరలేదని పేర్కొంది. ప్రజల వద్ద .ఇంకా రూ.6181 కోట్ల విలువైన నోట్లు చెలామణీలోనే ఉన్నట్లు గుర్తించింది. 2023 మే 19న ఆర్బీఐ అధికారికంగా 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే వాటిని రద్దు మాత్రం చేయలేదు. దీంతో ఇంకా ప్రజల వద్దే రూ.6181 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. 

అంతే కాదు వీటిని చెలామణీ కూడా చేసేస్తున్నారు.రూ.2 వేల నోట్ల ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్పుకోవచ్చని వెల్లడించింది. కాగా 2023 మే 19న రూ. 2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన టెండర్‌గానే ఉన్నాయని ఆర్‌బీఐ ధ్రువీకరించింది. అంటే, ఈ నోట్లను ఇప్పటికీ లావాదేవీలకు ఉపయోగించవచ్చు. కానీ తీసుకునేవారు ఉండటం కష్టం. కేవలం కొత్తగా ఈ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu