ఇది జగన్ మార్క్ రాజకీయం!?

ఊరు మీద పడి అమాయకులను వేధిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న రౌడీ బ్యాచ్ కు పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందంటూ వైసీపీ గుండెలు బాదేసుకోవడం ఏమిటి అని జనం విస్తుపోతున్నారు. ఔను ఐతానగర్ లో ఇటీవల ముగ్గురు యువకులకు పోలీసులు ఇచ్చిన ఓపెన్ లాఠీ ట్రీట్ మెంట్ పట్ల జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐతానగర్ వాసులు  ఇక తమకు రౌడీల పీడ వదిలిందని ఆనందంతో ఉన్నారు. అంతలోనే వైసీపీ కులం రంగు పులుముతూ తెరమీదకు వచ్చేసింది. పలు కేసులు ఉన్న గంజాయి రౌడీ బ్యాచ్ కి పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ అన్యాయం, దారుణం, దుర్మార్గం అంటూ  గగ్గోలు పెట్టేస్తోంది.     ఉగ్రవాదానికి మతం లేదన్నట్లుగానే..  రౌడీలకూ, క్రిమినల్స్ కు కులం ఉండదన్న విషయాన్ని విస్మరించి ఇప్పుడు వైసీపీయులు  కులం కార్డుతో రోడ్డెక్కుతున్నారు.  అలాంటి వారికి పోలీసులు చేసిన మర్యాద సరైనదే అని జనం ముక్తకంఠంతో చెబుతుంటే.. వైసీపీయులు మాత్రం ఘోరం జరిగిపోయినట్లు గుండెలు బాదేసుకుంటున్నారు. 
 
ఇక అసలు విషయానికొస్తే గుంటూరు జిల్లా తెనాలి  ఐతానగర్ ప్రాంతంలో ...లడ్డు బ్యాచ్ అని ఒక గ్యాంగ్ ఉంది..  వీళ్ళు చేసే అరాచకాలకు  హద్దూపద్దూ లేకుండా పోయింది. ఈ గ్యాంగ్ త రెండు నెలల కిందట   ఓ వ్యాపారిపై అకారణంగా దాడి చేసి కొట్టారు..  రోడ్డుపై వెళ్లే వారినీ,  వచ్చే వారిని టార్గెట్ చేసుకొని కొట్టమే వీళ్ళ  ప్రవృత్తిగా మారిపోయింది..  దీంతో పాటు రౌడీ యిజానికి పాల్పడుతున్న ఈ గ్యాంగ్ పై   2018 నుండి  పలు కేసులు ఉన్నాయి.  కేసుల దారి కేసులదే అన్నట్లుగా వీరి తీరు ఇసుమంతైనా మారలేదు.  పైగా లడ్డు బ్యాచ్ , కిల్లర్ బాచ్ అని బిరుదులు కూడా తగిలించేసుకుని రెచ్చిపోతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఇటీవల అయితానగర్ ప్రాంతంలో  నివాసం ఉంటున్న  చిరంజీవి అనే కానిస్టేబుల్ పై వీరు  దాడికి పాల్పడ్డారు.  బీసీ సామాజికవర్గానికి  చెందిన ఈ కానిస్టేబుల్  ఎస్సీ మహిళను వివాహం చేసుకుని ఐతానగర్ లో నివసిస్తున్నారు.   ఈ కానిస్టేబుల్ చిరంజీవి  లడ్డు గ్యాంగ్ అరాచకాలను ప్రశ్నించాడు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.

దాంతో చిరంజీవిపై క క్ష పెంచుకున్న ఈ గ్యాంగ్  దాడికి పాల్పడింది.  దీంతో పోలీసుల రంగంలోకి దిగారు.  ఈ రౌడీ గ్యాంగ్  లీడర్ లడ్డు పారారైపోగా,  మిగిలిన ముగ్గురు పోలీసులకు దొరికారు.  వాళ్లని దారిలో పెట్టడానికి భయం చెప్పాలన్న ఉద్దేశంతో  పోలీస్ మార్కు ట్రీట్ మెంట్ ఇచ్చి విక్రమార్కుడు సినిమా చూపించారు.    ఆ సందర్భంలో స్థానికులు అయితే ఈ రౌడీల పీడ విరగడయింది అన్న ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను అభినందించారు. అయితే వైసీపీ మాత్రం ఈ సంఘటనను తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడానికి రెడీ అయిపోయింది.   ప్రజా సంఘాల ముసుగు లో , కుల సంఘాల ముసుగులో రంగంలోకి దిగిపోయింది. ఈ సంఘటనకు కులం రంగు పులిమేసి రాజకీయం చేస్తోంది.   

అది సరిపోదన్నట్లు ఇప్పుడు సాక్షాత్తూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగిపోయారు. ఐతానగర్ రౌడీషీటర్లకు పరామర్శ పేరుతో ఆయన తెనాలి పర్యటనకు రెడీ అయిపోయారు. మంగళవారం (జూన్ 3)న సదరు రౌడీ షీటర్లను పరామర్శించనున్నారు.   ప్రజలను వేధించి, ఇబ్బందుల పాలు చేస్తున్న రౌడీషీటర్లకు వత్తాసుగా రాజకీయ లబ్ధిని వెతుక్కోవడమేంటంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu