రావెల సుశీల్ కు రెండు రోజుల కస్టడీ..

మహిళా టీచర్ ను వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రావెల కిశోర్ కుమారుడు సుశీల్ కు పోలీసులు రెండు రోజులు కస్టడీ విధించారు. ఈ నెల 6న సుశీల్‌ను నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. మంగళవారం వాదోపవాదాలు విన్న అనంతరం కోర్టు ఈ నెల 9, 10 తేదీల్లో కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో కోర్టు సుశీల్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu