తిరుమలలో వేడుకగా రథసప్తమి.. ఏకాంతంగా వాహన సేవలు..
posted on Feb 8, 2022 11:01AM
తిరుమలలో రథసప్తమి వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా శ్రీమన్నారాయణుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. కొవిడ్ నిబంధనల మేరకు వాహన సేవలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది.
రథసప్తమి మహోత్సవం, ఒక్కరోజు బ్రహ్మోత్సవంలో భాగంగా.. శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహిస్తారు. వాహనసేవల్లో పరిమిత సంఖ్యలోనే టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులను అనుమతించే అవకాశం ఉంది. శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని ప్రధాన ప్రాంతాల్లో ఏడు టన్నుల పుష్పాలతో అందంగా అలంకరించారు.
తిరుమలలో రథసప్తమి వాహన సేవలను ఎస్వీబీసీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారంలో తిలకించవచ్చు.
సూర్యప్రభ వాహనం: ఉదయం 6 నుంచి 8 గంటల వరకు..
చిన్నశేష వాహనం: ఉదయం 9 నుంచి 10 గంటల వరకు..
గరుడ వాహనం: ఉదయం 11 నుంచి 12 గంటల వరకు..
హనుమంత వాహనం: మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు..
చక్రస్నానం: మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు..
కల్పవృక్ష వాహనం: సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు..
సర్వభూపాల వాహనం: సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు..
చంద్రప్రభ వాహనం: రాత్రి 8నుంచి 9 గంటల వరకు..