హమ్మయ్య.. భారీగా తగ్గిన కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. నెల రోజుల తర్వాత వరుసగా రెండో రోజు లక్ష కంటే తక్కువ కరోనా కేసులు నమోదవడం. దీంతో జనానికి కాస్త ఊరిపి తీసుకునే అవకాశం దొరికినట్లయింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 67 వేల 597 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక రోజు ముందు అంటే సోమవారం నాడు 83 వేల 876 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 896 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. కరోనాతో గత 24 గంటల్లో 1,188 మంది మరణించారు.

కరోనా విషయంలో కాస్త ఉపశమనం కలిగించే అంశం ఏదంటే.. గత 24 గంటల్లో లక్షా 80 వేల 456 మంది కరోనా నుంచి కోలుకోవడం. ప్రస్తుతం దేశంలో లక్షా 14 వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనా పాజిటివిటీ రేటు రోజు రోజుకూ తగ్గుతుండడం సానుకూలాంశం. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆజ్యం పోసిన థర్డ్ వేవ్ ముప్పు కట్టడిలోకి వస్తోంది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం కరోనా నుంచి రికవరీ రేటు 96 పాయింట్ 46గా ఉంది.

మరో పక్కన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. గత ఏడాది జనవరి నుంచి 170 కోట్ల 21 లక్షల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 55 లక్షల 78 వేల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు వెల్లడించింది.

కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4 కోట్ల 23 లక్షల, 39 వేల, 611 మందికి వ్యాధి సోకింది. వారిలో ఇప్పటి వరకు 5 లక్షల 4 వేల 62 మంది మరణించారు. ఇప్పటి వరకు 4 కోట్ల 8 లక్షల 40 వేల మంది కోలుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu