జగన్ కూడా తప్పించుకోలేడు
posted on Apr 10, 2015 9:13AM
.jpg)
దేశంలో ఎక్కడ ఎవరు అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళినా అందరికీ టక్కున జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తుంటారు. ఇదివరకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుల్లో జైలుకి వెళ్ళినప్పుడు చాలా మంది జగన్ కేసుల గురించి మాట్లాడుకొన్నారు. మళ్ళీ నిన్న రామలింగ రాజుకి కోర్టు ఏడేళ్ళు జైలు శిక్షవేసిన తరువాత చర్లపల్లి జైలుకి తరలించినప్పుడూ మళ్ళీ జగన్ ప్రస్తావన వినబడింది.
రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు సి. కుటుంబరావు మీడియాతో మాట్లాడుతూ రామలింగరాజుకి ఏడేళ్ళు జైలు శిక్ష విధించడం గమనిస్తే ఆర్ధిక నేరాలపట్ల కోర్టులు చాలా కటినంగా వ్యవహరిస్తాయని స్పష్టమవుతోంది. కనుక అనేక ఆర్ధిక నేరాలకి పాల్పడిన జగన్ కూడా చట్టం నుండి తప్పించుకోలేడు. ఏదో ఒకరోజున అతను కూడా జైలుకి వెళ్ళాక తప్పదు. ఆ సంగతి గ్రహించబట్టే అతను ప్రజలలో సానుభూతి సంపాదించుకోవడానికి బస్సు యాత్రలు చేస్తున్నారు,” అని అన్నారు.