చిరంజీవి, కావూరి రాజీనామా చేయండి: కురియన్ ఆగ్రహం
posted on Feb 19, 2014 3:06PM
.jpg)
రాజ్యసభలో సమైక్య నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సా౦బ శివ రావులపై డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనపై సభలో నిరసన తెలపాలనుకుంటే తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపాలని సూచించారు. బీజేపీ నేతలు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు కూడా కల్పించుకుని సొంత పార్టీ నేతలే సభలో గందరగోళం చేయడం సరికాదని, రాజ్యసభకు కేంద్రమంత్రులు సమాధానం చెప్పడానికే రావాలని, నిరసనలు తెలపకూడదని వారు సూచించారు. మరోవైపు మత్స్యకారుల బిల్లుపై తేల్చిన తర్వాతే వేరే బిల్లుల సంగతి చూడాలని అన్నాడీఎంకే సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ చైర్మన్ వెల్‌లో సీమాంధ్ర ఎంపీలు సీఎం రమేష్, సుజనాచౌదరి, కేవీపీ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలుపుతున్నారు.