రజనీ రాజకీయ ప్రవేశంపై కమల్‌ సంచలన వ్యాఖ్యలు.. ఆరాటం ఎక్కువ..

 

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఇంకా రాలేదు కానీ అప్పుడే ఆయనపై వార్తలు మాత్రం తెగ వచ్చేస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవాళ్లు కొంతమంది ఉంటే.. ఆయనపై విమర్శలు చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మరో హీరో చేరారు. ఆయనెవరో కాదు.. ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌. రజనీకాంత్‌పై కమల్‌హాసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చెన్నైలో కమల హాసన్ మాట్లాడుతూ... కెమెరాలు ఎక్కడ ఉంటాయో రజనీకాంత్‌కు బాగా తెలుసని.. రజనీకాంత్ కు కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కువ... అందుకే ఇలా హడావుడి చేస్తున్నారని ఆయన అన్నారు. కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీకాంత్ ప్రత్యక్షమవుతారని విమర్శించారు. అంతే ఇప్పుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చాంశనీయంగా మారాయి. మరి దీనిపై రజనీ కాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.