రజనీపై జయ మేనకోడలు కామెంట్లు.... రజనీ అర్హతలేంటి..?
posted on May 24, 2017 4:28PM
.jpg)
తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా రాజకీయాల్లోకి రాకముందే అప్పుడే పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలవుతున్నాయి. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు.. ఏ పార్టీలో చేరతారు..? కొత్త పార్టీ పెడతారా..? ఇలా ఒకటి కాదు రెండు కాదు పలు ప్రశ్నలు ఒకదాని తరువాత ఒకటి తలెత్తుతున్నాయి. ఇక ఆయనకు మద్దతిచ్చే వారు చాలా మంది ఉండగా... ఆయనపై విమర్సలు గుప్పించే వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో జయ మేనకోడలు దీపా కూడా చేరిపోయారు. ఆయనకు రాజకీయాల గురించి ఏం తెలుసంటూ ప్రశ్నించారు. సినీ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తే చాలని అన్నారు. ముందుగా సినీ రంగంలో ఉన్న సమస్యలను కొలిక్కి తెచ్చి, రాజకీయాలకు సంబంధించి ఆలోచన చేయాలని ఆమె హితవు పలికారు. రాజకీయాల గురించి మాట్లాడటానికి రజనీకి ఉన్న అర్హతలేంటని ప్రశ్నించారు. దీపా వ్యాఖ్యలపై తమిళనాట ఆగ్రహం వ్యక్తమవుతోంది. రజనీ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.