చైన్ స్నాచర్ బ్యాచ్.. రౌడీ షీటర్ల లీడర్! వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రచ్చ రంబోలా

ఆ ఇద్దరు ఒకే పార్టీ నాయకులు.. ఒకరు ఎంపీ ఇంకొకరు ఎమ్మెల్యే. ఇద్దరు రాజకీయ  కుటుంబాల నుంచి వచ్చిన యువ నాయకులు. అయితే ఆ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి  అవసరం అయినా లేకుండానే మాటల మంటలు ఎగసెగసి పడతున్నాయి. ఆ ఇద్దరు ఇంకెవరో కాదు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. 

ఈ ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలు.. పైగా ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  చాలా సన్నిహితులు. జక్కంపూడి రాజ తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రి వర్గంలో పనిచేసారు. జక్కంపూడి అనారోగ్యంతో  మంచం పట్టినా, కదల లేక పోయినా వైఎస్ ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించలేదు. బాద్యత (శాఖ) లేని మంత్రిగా కొనసాగించారు. 

ఇప్పుడు జక్కంపూడి జూనియర్, యంగ్ ఎంపీ భరత్ మధ్య మాటల యుద్ధం మహా జోరుగా సాగుతోంది. జక్కంపూడి సోమవారం భరత్ మీద భగ్గుమన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో చేతులు కలిపి వైసేపీని దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జగన్ రెడ్డిని జైలు పాలు చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మినారాయణతో అదే విధంగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుతో సంబంధాలున్నాయి, అటు నుంచి జరుగుతున్న కుట్రలలోనూ భరత్ ఇన్వాల్వ్ అయ్యారని జక్కం పూడి ఆరోపించారు. 

జక్కంపూడికి జవాబుగా  కౌంటర్ ఇచ్చారు భరత్. కుమ్ముక్కు రాజకీయాలు ఎవరు చేస్తున్నారో, ఎవరు పార్టీకి. పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. అలాగే జక్కంపూడి, పిల్లోడు అన్నట్లుగా..ఆయనలా తానూ పిల్లల రాజకీయలు చేయనని అన్నారు. పార్టీ గీసిన లక్ష్మణ గీత దాటననీ అదనీ ఇదనీ చాలా చెప్పుకొచ్చారు. అయితే, ఇన్ని సుద్దులు చెప్పి చివరకు, సొంత పార్టీ ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను  పట్టుకుని రౌడీ షీటర్, చైన్ స్నాచర్ బ్యాచ్’ అంటూ ఎద్దేవా చేశారు. అఫ్ కోర్స్ జక్కంపూడి కూడా సొంత పార్టీ ఎంపీ మీద ఇదే విధమైన ..అయితే .. ఈ వివాదం చూసిన జనాలు దొందూ దొందే ... ఇద్దరు ఆ తాను ముక్కలే అంటున్నారు.