ఎరక్కపోయి ఇరుకున్నారా? యువనేత బుక్కయ్యారా?

తెలంగాణ రాజకీయాలలో రోజుకో వివాదం రివాజుగా మారి పోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని తేలడంతో రాజకీయ పార్టీలు కొత్త  మత్తు వేటలో పడ్డాయి. అనుకోకుండా  అన్ని మత్తుల్లోకి మహా మత్తు డ్రగ్స్ వివాదం కాలికి తగిలింది. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే చాలు అదే వార్త... డ్రగ్స్ చుట్టూనే రాష్ట్ర రాజకీయం తూలుతోంది... ఊగుతోంది..ఊగుతూ తూలుతోంది.కీలక నేతలకు కంటికి  కునుకు లేకుండా చేస్తోంది. ఎరక్క పోయి  పోయి ఇరుక్కున్నను అని .. సోలో గా పాటలు కూడా పాదేసు కుంటున్నారు. 

నిజానికి అటు ఉగ్రవాదం నుంచి ఇటు డ్రగ్ మాఫియా వరకు అన్ని రకాల అంతర్జాతీయ, జాతీయ స్థాయి  నేరాలు  ఘోరాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందనేది అందరికీ తెలిసిన నిజం. అయితే, ఈ డ్రగ్ మాఫియాను వెనక నుంచి నడిపిస్తోంది మాత్రం, అన్ని నేరాలకు అమ్మ తల్లి. మదర్ ఆఫ్ ఆల్ క్రైమ్స్, ‘రాజకీయం’  దటీజ్ పాలిటిక్స్’ అనేది మాత్రం కొదరికి మాత్రమే తెలిసిన నిజం. అందులోనూ, ఇంతలోనే ఇంతై .. ఇంతింతై .. ఇంకెంతో అవ్వాలని, ఆ ఒక్క మెట్టు ఎక్కేయాలని.. ఆ కుర్చీ  ఎక్కేయాలని  ఆశ పడుతున్న కీలక నేత పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నిజం... తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ డ్రగ్ మాఫియాది, మాములు సామ్రాజ్యం కాదు, మహా సామ్రాజ్యం. ఈ మహా సామ్రాజ్యంలో ఎవరున్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని అలా ఉంచితే, యంగ్, ఎనర్జిటిక్, స్మార్ట్ బాస్  పాత్ర ఉందనేది మాత్రం కాదనలేని నిజం అంటున్నారు.  నిజానికి టీపీసీసీ అధ్యక్షుడు రెడ్డి వైట్ లెంజ్ లక్ష్యం కూడా ఈ నాయకుడే అంటారు. అంతే కాదుట .. రేవంత్ రెడ్డి, ‘ ఛాలెంజ్’ కి అవసరమైన సరకును అందించింది కూడా మరో పాపులర్ ‘ఛాలెంజరే .. అని  కూడా అంటారు. 

అదలా ఉంటే తెర మీద వినిపిస్తున్న ఛాలెంజ్ ల విషయంలోకి వెళితే, తీగ లాగితే డొంకంతా కదినట్లు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ డ్రగ్ కథ వెంక ఉన్న కథలో ... ఆయన పాత్ర చాలా కీలకం. నిజంగా ఆయనకు డ్రగ్స్ తీసుకునే అలవటు ఉందా.. లేదా అనేది ఈరోజు కాకపోతే రేపైనా తేలుతుంది. అయితే, ఆయనకు ఇటు  సినిమా రంగంలో, అటు వ్యాపార కుటుంబాల యువ రాజులతో మంచి సంబంధాలున్నాయి. అందులో కొందరికి డ్రగ్స్ అలవాటు కూడా ఉంది. అందాల తార విషయం అనగానే అయన స్పెషల్ ఇంటరెస్ట్ తీసుకున్నారు. విషయం ఏమంటే... మిత్ర ధర్మంగా వారిని రక్షించేందుకు అయన ..ఢిల్లీ వరకు వెళ్లారు ..న్యాయవ్యవస్థలో కీలక బాధ్యతలలో ఉన్నవారిని కలిశారు ... ఈడీ ఉచ్చు నుంచి ఆ ఇద్దరిని సేవ్ చేసేందుకు  అయన అందాక వెళ్లారు. అయితే, ఇప్పుడు అసలు కథ పక్కుకు పోయి అయన మెడకే డ్రగ్స్ ఉచ్చు చుట్టుకుంటోంది. చివరకు ఏమవుతుందో .. చూడవలసిందే..అంటున్నారు.