మహ్మద్ సిరాజ్‌పై ప్రశంసల వర్షం
posted on Aug 4, 2025 9:51PM

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన మహ్మద్ సిరాజ్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ట్వీట్టర్ వేదికగా సిరాజ్‌ను హైదరాబాద్ స్టైల్లో పొగడ్తలతో ముంచెత్తాడు. సిరాజ్ ‘ఎప్పుడూ విజేతే @mdsirajofficial! మన హైదరాబాదీలో మాట్లాడతే.. పూరా ఖోల్ దియే పాషా!’అంటూ అభినందించాడు. మరోవైపు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ సిరాజ్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు ఏదీ సాటిరాదని అభిప్రాయపడ్డారు. కీలక మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు మరుపురాని విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే.. సిరాజ్ ఆటతీరుపై తెలంగాణ డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘డీఎస్పీ సిరాజ్ అద్భుతంగా పోరాడారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్‌లో జట్టు మరిన్ని విజయాలు అందించాలి. ప్రతీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించాలి.
ఇవాళ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఐదు వికెట్లు తీసి జట్టును గెలిపించిన సిరాజ్‌కు అభినందనలు’ అని డీజీపీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆరుపరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టు ఇంగ్లండ్‌ను భారత్ మట్టి కరిపించింది. ఈ మ్యాచ్ విజయంతో సిరీస్2-2 సమమైంది. మమ్మద్ సిరాజ్ ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు తీసి మెరుపులు మెరిపించాడు. చివరి మ్యాచ్‌లో అతడు తీసిన ఫైవ్ వికెట్ హల్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.