రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌ భేటీ

 

రాజ్ భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా భేటీ అయ్యారు. హైదరాబాద్ భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌తో  సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. 

ఆర్టీఐ ఫైళ్ల క్లియరెన్స్ పై గవర్నర్ తో చర్చించిన సీఎం.. మిస్ వరల్డ్ 2025 వేడుకలకు ఆహ్వానించినట్లు సమాచారం. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త  పరిస్థితుల మధ్య హైదరాబాద్ లో మిస్ వరల్డ్ వేడుకలు జరుగుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆథిత్యం వహిస్తుండగా.. మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా  జరగనున్న ఈ వేడుకను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో 120 పైగా దేశాల అందగత్తెలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు గవర్నర్‌‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu