ఏపీకి భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి  ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వాతా వరణ శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు  దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వేసిన ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది. 

 కొన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉంది.  వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య,  సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే  విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తరు  నుంచి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu