హైదరాబాద్ మెట్రో ఛార్జీలు తగ్గింపు

 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్నాది. ఈ నిర్ణయంతో ప్రయాణికులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గనుంది. ఇటీవల ఛార్జీల పెంపుపై ప్రయాణికుల ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుండి అమలులోకి రానున్నట్టు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. మే17వ తేదీ నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. క‌నీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గ‌రిష్ఠ టికెట్ ధ‌ర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. ఇలా కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు ఛార్జీలు పెంచినట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. అయితే ఈ పెరిగిన చార్జీలను యథాతథంగా ఉంచలని హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం నిర్ణయించింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu