అక్బరుద్దీన్‌పై దాడి కేసు..దోషులకు శిక్ష ఖరారు..!
posted on Jun 29, 2017 1:16PM

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై 2011 ఏప్రిల్ 30న దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు నేడు వెలువడింది. ఈ కేసులో నలుగురిని సలీం బిన్, అబ్దుల్లా, అవద్, హసన్ బిన్ నాంపల్లిలోని 7వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పహిల్వాన్‌పై న్యాయస్థానం కేసు కొట్టివేసింది. పహిల్వాన్ సహా పదిమంది నిందితులకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. కాగా సుమారు 15 మంది అక్బరుద్దీన్ ను చుట్టుముట్టి కత్తులతో హతమార్చేందుకు ప్రయత్నించగా, అక్బరుద్దీన్ గన్ మెన్ కాల్పుల్లో దాడికి పాల్పడ్డ వారిలో ఇబ్రాహీం బిన్ యూనిస్ యాఫై అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో తీవ్రమైన కత్తిపోట్లకు గురైన అక్బరుద్దీన్ ఒవైసీ ఇంచుమించు చావు అంచుల దాకా వెళ్లి, సుదీర్ఘ కాలం చికిత్స తీసుకుని, బతికి బయటపడ్డారు.